డయాబెటిస్ ఉన్నవారు వంకాయ తింటే ఏమి అవుతుందో తెలుసా?

Brinjal for diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారు వంకాయ తింటే ఏమి అవుతుందో తెలుసుకుందాం.

వంకాయలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కరిగే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వంకాయలోని ఆల్ఫా-గ్లూకోసిడేస్ సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే అధిక గ్లూకోజ్ స్థాయిల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వంకాయలో చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.

వంకాయలో ఫైబర్, మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి. అలా కొలెస్ట్రాల్ పెరగకుండా వంకాయ సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

వంకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన మూత్రపిండాలు, కాలేయం మరియు గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వంకాయలో యాంటీఆక్సిడెంట్లలో ఫైటోన్యూట్రియెంట్లు మరియు ఫినోలిక్ సమ్మేళనాలు ఉండుట వలన డయాబెటిస్ కారణంగా వచ్చే ఇతర అవయవాలపై వచ్చే దుష్ప్రభావాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.