పెరుగు+వాము కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Curd And Ajwain benefits in telugu : వాము,పెరుగు రెండింటిలోను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. ఒక కప్పు పెరుగులో అరస్పూన్ వాము కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కడుపు నొప్పితో బాధపడేవారు పెరుగులో వాము కలిపి తీసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
అలాగే జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మనలో చాలా మంది పెరుగు అన్నం తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. అలాంటి వారు ఈ విధంగా తీసుకున్న సరిపోతుంది. రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
అంతేకాక రక్తప్రవాహం బాగా సాగి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి,ఆందోళన వంటి సమస్యలు ఉన్నప్పుడూ పెరుగు,వాము కలిపి తీసుకుంటే ప్రశాంతత కలుగుతుంది. అలాగే తలనొప్పి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ వేసవిలో నోటిలో పొక్కులు వస్తూ ఉంటాయి.
వాటిని తగ్గించటానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు పెరుగులో వాము కలిపి తీసుకుంటే చాలా మంచిది. ఏ సమస్యలు లేనివారు వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.