దీన్ని ఒక్కసారి జుట్టుకి రాస్తే జుట్టు నల్లబడుతుంది …మళ్ళీ మళ్ళీ తెల్లబడదు

White Hair Tips : ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య,జుట్టు రాలే సమస్య వంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలు తగ్గాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే నూనెను వారంలో రెండు సార్లు రాస్తే మంచి ఫలితం వస్తుంది.

ఈ చిట్కా కోసం మిక్సీ జార్ లో ఒక స్పూన్ కలోంజీ గింజలు, ఒక స్పూన్ మెంతులను వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి ఆవనూనె పోసి కాస్త వేడి అయ్యాక మిక్సీ చేసుకున్న పొడిని వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలు అయ్యాక స్పూనున్నర హెన్నా పొడిని వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమం నలుపు రంగు వచ్చేవరకు పొయ్యి మీద ఉంచాలి. ఆ తర్వాత కాస్త చల్లారాక వడకట్టి ఉంచుకోవాలి. అరగంట అయ్యాక ఈ నూనెను జుట్టు మొదళ్లు నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. ఇలా పట్టించాక ఒక గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

ఈ విధంగా చేయటం వలన తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య వంటి జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.