జామ ఆకులు+తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Guava leaf And Honey Benefits : జామ ఆకులు,తేనె రెండింటిలోను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మూడు జామ ఆకులను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి కట్ చేసిన జామ ఆకుల ముక్కలను వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.
Guava leaves good for dengue In Telugu
మరిగిన ఈ నీటిని గ్లాసులో వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి,క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ సమృద్దిగా ఉంటాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి గుండె ప్రవాహం బాగా సాగేలా చేస్తుంది.

శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ టీ ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. జామ ఆకులలో విటమిన్ సి మరియు ఐరన్ అధిక స్థాయిలో ఉండుట వలన దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం పొందడంలో చాలా సహాయపడుతుంది.

ఎందుకంటే ఇది శ్వాసకోశ, గొంతు మరియు ఊపిరితిత్తులలో శ్లేష్మం లేకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది మీ నరాలను,మనస్సును ప్రశాంతపరచి గాడ నిద్ర పట్టటానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.