పైసా ఖర్చు లేకుండా ఇంటిలో ఉండే పదార్ధాలతో పొడి జుట్టును మృదువుగా మార్చుకోవచ్చు

Simple Home Remedy dry hair smooth : జుట్టు పొడిగా మారినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా పొడి జుట్టును మృదువుగా మార్చుకోవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులో ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తగ్గించుకోవచ్చు.

చిన్న బంగాళాదుంపను తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసేసి తురమాలి. ఒక గిన్నెలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బంగాళాదుంప తురుమును వేసి బాగా ఉడికించాలి. ఉడికిన బంగాళాదుంప తురుమును మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

బంగాళాదుంప పేస్ట్ లో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ కొబ్బరి నూనె,ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అలా వదిలేసి కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే పొడిగా మారిన జుట్టు మృదువుగా మారుతుంది.

జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఈ ప్యాక్ వేయటం వలన జుట్టుకి సమబందించిన అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి. జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేయటానికి బంగాళాదుంప,పెరుగు,బాదం నూనెలో ఉన్న లక్షణాలు సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.