1 గ్లాసు శరీరంలో పేరుకున్న కొవ్వు,వేడిని తగ్గించి అలసట,నీరసం లేకుండా చేస్తుంది
Weight Loss Drink in Telugu : వేసవికాలం ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ సమయంలో బరువు తగ్గాలంటే కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వేసవిలో నీరసం,అలసట,నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
అంతేకాకుండా వేసవిలో ప్రతి ఒక్కరినీ వేదించే అలసట,నిరాశ,నిస్సత్తువ వంటివి లేకుండా చేస్తుంది. ఒక స్పూన్ సబ్జా గింజలను నీటిని పోసి రెండు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్ తీసుకొని తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత అరకప్పు పుచ్చకాయ ముక్కలను సిద్దం చేసుకోవాలి.
ఇక ఇప్పుడు మిక్సీ జార్ లో క్యారెట్ ముక్కలు,పుచ్చకాయ ముక్కలు,అరచెక్క నిమ్మరసం,సరిపడా నీటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి ఒక స్పూన్ తేనె,నానబెట్టిన సబ్జా గింజలను వేసి బాగా కలపాలి. ఈ డ్రింక్ ని ప్రతి రోజు తాగితే శరీరంలో వేడి, అలసట,నీరసం వంటివి తగ్గటమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.
వేసవిలో వచ్చే డీహైడ్రేషన్,సన్ స్ట్రోక్ వంటివి కూడా ఉండవు. కొంతమందికి ఒత్తిడి,తలనొప్పి వంటివి కూడా వస్తూ ఉంటాయి. వాటి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. జీవక్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దాంతో వేసవిలో వచ్చే జీర్ణ సంబంద సమస్యలు కూడా ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.