వాము+తేనె కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Ajwain And Honey Benefits in telugu : వాము,తేనె రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు,పోషకాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. ఒక స్పూన్ తేనెలో పావు స్పూన్ లో సగం వామును వేసి పావుగంట అలా వదిలేసి తీసుకోవాలి. లేదా ఒక కప్పు తేనెలో రెండు స్పూన్ల వామును వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవచ్చు.
honey
దీనిని రోజుకి ఒక స్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. జీర్ణ సంబంద సమస్యలు అయినా గ్యాస్,అజీర్ణం,కడుపు ఉబ్బరం,ఎసిడిటీ వంటి సమస్యలు లేకుండా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఛాతీ (ఊపిరితిత్తులు) యొక్క మార్గాన్ని క్లియర్ చేయడానికి సహాయ పడుతుంది. గొంతు నొప్పి,గొంతు ఇన్ ఫెక్షన్,దగ్గు వంటి వాటికి మంచి ఉపశమనం అందిస్తుంది.

కిడ్నీలో ఉండే చిన్న చిన్న రాళ్ళను కరిగిస్తుంది. పది రోజుల పాటు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఉదయం సమయంలో పరగడుపున తీసుకుంటే సరిపోతుంది. ఆస్తమా ఉన్నవారికి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టి వాము,తేనె కలిపి తీసుకొని ఇప్పుడు చెప్పిన అన్నీ రకాల ప్రయోజనాలను పొందండి. తేనె ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచి ఫలితాలను అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.