Beauty Tips

జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టిస్తే జుట్టు రాలకుండా విపరీతంగా పెరుగుతుంది

Hair Growth Tips in Telugu : జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా ఒత్తుగా పెరగటానికి మనలో చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలను చేసి చాలా విసిగిపోయి ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపిక,శ్రద్ద ఉంటే చాలు ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.
kalabanda benefits in telugu
దీని కోసం కలబందను తీసుకొని సైడ్స్ లో ఉండే బాగాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఈ ముక్కలు ఒక కప్పు ఉండేలా చూసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ టీ పొడి వేసి అవసరమైన నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని హెయిర్ స్కాల్ప్ దగ్గర బాగా అప్లై చేయాలి. ఈ స్కాల్ప్ దగ్గరే మనకు ఎక్కువగా జుట్టు రాలటం అనేది జరుగుతుంది, కాబట్టి అక్కడ ఎక్కువగా అప్లై చేస్తే ఆ ప్రదేశంలో తిరిగి జుట్టు రావడం ప్రారంభం అవుతుంది. అలాగే జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
hair fall tips in telugu
ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా జుట్టు కాంతివంతంగా మెరిసేలా ఒత్తుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.