ఈ కాయలతో ఇలా చేస్తే చాలు నొప్పులను తగ్గించి నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది…ఇది నిజం

Joint Pains Home Remedies In telugu : ప్రస్తుతం మారిన పరిస్థితులు, ఎక్కువసేపు కూర్చొని ఉండటం,శారీరక శ్రమ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో కీళ్లనొప్పులు,నడుము నొప్పి వంటివి వచ్చేస్తున్నాయి. వీటిని తగ్గించుకోవటానికి ఉమ్మెత్త కాయలు చాలా బాగా సహాయ పడతాయి. ఈ కాయలు పల్లెటూర్లలో ఉండేవారికి బాగా తెలుసు.
Joint pains in telugu
ఉమ్మెత్త చెట్టు నుండి కాయలను సేకరించి వీటికి ఉండే తొడిమలను కట్ చేయాలి. పొయ్యి వెలిగించి ఒక లోతైన గిన్నె పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆవనూనెను పోయాలి. ఆవనూనె లేకపోతే నువ్వుల నూనె వాడవచ్చు. కానీ నువ్వుల నూనెతో పోలిస్తే ఆవనూనె నొప్పులను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నూనె కాస్త వేడి అయ్యాక ఉమ్మెత్త కాయలను వేసి స్టవ్ తక్కువ మంటలో పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి.

బాగా ఫ్రై అయిన తర్వాత ఆ నూనెలో నుండి ఉమ్మెత్త కాయలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ నూనెను చల్లారాక సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు, నడుము, వెన్ను నొప్పి, మెడ ఇలా ఎలాంటి నొప్పులను అయినా చాలా సులభంగా తగ్గిస్తుంది.

ఈ విధంగా ప్రతి రోజు ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే నొప్పులు క్రమంగా తగ్గుతాయి. ఉమ్మెత్త కాయలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంటి చిట్కాలు నొప్పులను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.