Beauty Tips

Cracked Heels:ఈ చిట్కా పాటిస్తే చాలు కేవలం 3 రోజుల్లోనే పాదాల పగుళ్లు మాయం అవుతాయి

cracked heels Home Remedies : పాదాల పగుళ్లు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా పగుళ్ళ మధ్య దుమ్ము,ధూళి పెరుకుపోయి సమస్య ఎక్కువ అవుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నాలు చేయాలి. మార్కెట్ లో దొరికే క్రీమ్స్ కన్నా ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.

పాదాల పగుళ్లు రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొబ్బరి నూనె, ఆముదం, మీగడ వంటి వాటితో సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ మూడింటిలో ఏది అందుబాటులో ఉంటే దానిని తీసుకొని పాదాల పగుళ్ళు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి.

ఆ తర్వాత పాదాలని సుమారు 20 నిముషాల పాటు గోరువెచ్చని నీరు ఉన్న బకెట్ లో ఉంచుకోవాలి. తర్వాత మెత్తటి బ్రష్ లేదా కాళ్ళు రుద్దుకునే రాయి తీసుకోని పాదాలని శుభ్రం చేయాలి. ఈ విధంగా పది రోజుల పాటు ప్రతి రోజు చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కొబ్బరి నూనె, ఆముదం, మీగడ ఈ మూడు పాదాల పగుళ్లను తగ్గించటానికి చాలా సమర్ధ వంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇంటి చిట్కాలు ఫాలో అయ్యి పాదాల పగుళ్ళ సమస్య నుంచి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.