ఈ ఆకులతో చేసిన నూనె తలకు పట్టిస్తే జీవితంలో జుట్టు రాలదు…తెల్లజుట్టు అనేదే ఉండదు

Hair Fall Tips In Telugu : జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇపుడు చెప్పే నూనెను వాడితే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టు సమస్య కూడా తగ్గుతుంది. ఒక్కసారి ఈ నూనెను తయారుచేసుకుంటే నెల రోజుల పాటు వాడవచ్చు.
hair fall tips in telugu
250 గ్రాముల కొబ్బరి నూనెలో 10 మందార ఆకులు లేదా 5 మందార పువ్వులు ,గుప్పెడు వేప ఆకులు, 5 ఆముదం ఆకులు,గుప్పెడు తంగేడు ఆకులు,అరకప్పు కలబంద గుజ్జు, గుప్పెడు గుంటగలగరాకు, అరకప్పు ఎండిన ఉసిరి ముక్కలు,గుప్పెడు గోరింటాకు, రెండు స్పూన్ల మెంతులు , వట్టివేర్లు వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి 15 నిమిషాల పాటు మరిగించాలి.

మరిగిన ఈ నూనెను వడకట్టి ప్రతి రోజు జుట్టుకు రాస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. తెల్ల జుట్టు ప్రారంభ దశలో ఉన్నవారు ఈ నూనెను వాడితే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. సహజసిద్దమైన వస్తువులతో తయారుచేసుకోవటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.

ఈ నూనెను ఒక్కసారి తయారుచేస్తే నెల రోజుల వరకు వాడుకోవచ్చు. మార్కెట్ లో దొరికే నూనెలు కన్నా సహజసిద్దంగా చేసుకున్న నూనెలను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెను కాస్త ఓపికగా చేసుకోవాలి. ఈ నూనెలో వాడిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.