ఈ ఆకుతో ఇలా చేస్తే చాలు మడమ నొప్పి మాయం అవుతుంది….జీవితంలో ఉండదు

How to cure heel pain at home in Telugu : మడమ నొప్పి అనేది వచ్చిందంటే విపరీతమైన బాధ ఉంటుంది. మడమ నొప్పి ఉన్నప్పుడూ పనులు చేయటానికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఈ నొప్పి అనేది ఒక పట్టానా తగ్గదు. మడమ నొప్పి అనేది గట్టి నేల మీద బలంగా పరుగెత్తటం, ఎక్కువసేపు నిలబడే ఉండటం.. ఏదైనా కారణం వలన కండరం మీద తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు వస్తుంది.

రాత్రి పడుకొని ఉదయం మంచం దిగుతూనే కాలు నేల మీద పెట్టాలంటే చాలామందికి నరకం కనిపిస్తుంటుంది. అంత బాధ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వేసుకున్న ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అంతేకాక ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

రెండు ఆముదం ఆకులు,4 వెల్లుల్లి రెబ్బలు,రెండు కర్పూరం బిళ్ళలను మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కొంచెం వేడి చేసి నొప్పి ఉన్న మడమకు రాసి ఒక క్లాత్ చుట్టాలి. అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. నొప్పి ఎక్కువగా ఉంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకోవాలి.

ఈ విధంగా మూడు రోజుల పాటు వేసుకుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నొప్పి రాగానే చాలా మంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం పొందవచ్చు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.