ఇలా చేస్తే చాలు 2 నిమిషాల్లో మైగ్రేన్ తలనొప్పి మాయం అయ్యి జీవితంలో ఉండదు
Migraine Headache Remedies In Telugu :ప్రస్తుతం ఉన్న జీవనశైలి ఒత్తిడి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్నారు మైగ్రేన్ తలనొప్పి అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనబడుతోంది. ఎక్కువ శాతం తలకు ఒక వైపు మాత్రమే వస్తుంది.
నొప్పి ఉన్నప్పుడు ప్రశాంతత అనేది ఉండదు. ఏ పని మీద దృష్టి పెట్టలేం. తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఈ చిట్కాలను పాటిస్తే కాస్త మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవచ్చు.మైగ్రేన్ తలనొప్పి చెక్ పెట్టడానికి మెడిటేషన్ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
అంటే పాలకూర, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, తృణధాన్యాలు, చిలకడ దుంపలు వంటివి తీసుకోవాలి. తలనొప్పి ఉన్న ప్రదేశంలో కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. కాఫీ టీలకు దూరంగా ఉండాలి. లావెండర్ ఆయిల్ ని తల భాగంలో రాసుకుని మసాజ్ చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
అలాగే యోగా, వ్యాయామం వంటివి చేయాలి. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు చీకటి గదిలో పడుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. మైగ్రైన్ తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పిన చిట్కాలను పాటిస్తే చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.