ఈ పొడితో ఇలా చేస్తే చాలు చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా జీవితంలో అసలు ఉండదు

Dandruff Home Remedies In Telugu : చుండ్రు సమస్య అనేది ఒక్కసారి వచ్చిందంటే అంత తొందరగా వదలదు. చుండ్రు సమస్య కారణంగా జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. చుండ్రు సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకోవాలి. ఈ సమస్యను తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలను,షాంపూలను వాడవలసిన అవసరం లేదు.
usiri benefits in telugu
మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో తగ్గించుకోవచ్చు. చుండ్రు నివారణ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఎండిన ఉసిరి ముక్కలను నీటిలో వేసి అరగంట నానబెట్టాలి. గుప్పెడు తులసి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత నానిన ఉసిరి ముక్కలను వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఎండిన ఉసిరి ముక్కలు మార్కెట్ లో లభ్యం అవుతాయి.

ఉసిరి ముక్కలు దొరక్కపోతే ఉసిరి పొడి ఉపయోగించవచ్చు. తులసి పొడిని కూడా వాడవచ్చు. తులసి,ఉసిరి పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట అలా వదిలేసి ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

తులసి,ఉసిరిలో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించటానికి మరియు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.