ఉల్లిరసంలో ఈ పేస్ట్ కలిపి రాస్తే జుట్టు అసలు రాలదు….ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Onion fenugreek seeds Hair fall tips : ప్రస్తుతం ఉన్న రోజుల్లో పని ఒత్తిడి,ఆహారపు అలవాట్లు వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలిపోతుంది. దీని కోసం మార్కెట్ లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను వాడవలసిన అవసరం లేదు. మన వంటింటిలో సహజసిద్దంగా దొరికే రెండు వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది.
Onion beaUTY tIPS
రెండు స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను తీసుకొని పై తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి రసం తీసుకోవాలి. ఉల్లిపాయ రసంలో మెంతుల పేస్ట్ కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.

అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే సరిపోతుంది. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నవారు వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. ఉల్లి రసం జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది.

మెంతులు తలలో వేడిని,ఒత్తిడిని తగ్గించి జుట్టు ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. పొడి జుట్టు ఉన్నవారు ఈ పేస్ట్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆముదం కలిపితే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లి,మెంతులు జుట్టు సంరక్షణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.