ఈ గింజలను ఇలా తీసుకుంటే 15 రోజుల్లో ధైరాయిడ్ సమస్య మాయం అవుతుంది

Thyroid Home Remedies In telugu : థైరాయిడ్ సమస్య ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ధైరాయిడ్ సమస్య వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయ్యితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడూ ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

థైరాయిడ్ గ్రంధి హార్మోన్లను తక్కువగా విడుదల చేస్తే హైపో థైరాయిడ్ అని, ఎక్కువగా విడుదల చేస్తే హైపర్ థైరాయిడ్ అని అంటారు. థైరాయిడ్ ఉన్నవారిలో జుట్టు రాలిపోవటం,బరువు పెరగటం,చెమటలు ఎక్కువగా పట్టటం, తొందరగా అలసిపోవటం వంటి లక్షణాలు కనపడతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడూ మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

థైరాయిడ్ సమస్యను తగ్గించటానికి అవిసె గింజలు సహాయపడతాయి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగు పరిచి.. థైరాక్సిన్ కావాల్సినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అవిసె గింజలను రోజూ ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

అవిసె గింజలను వేగించి పొడిగా తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడిని కలిపి తాగవచ్చు. లేదా భోజనంలో కలుపుకొని తినవచ్చు. లేదా అవిసె గింజలను నీటిలో 8 గంటల పాటు నానబెట్టి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ఈ పొడిని చపాతీ,అట్లు వంటి వాటిలో కలుపుకోవచ్చు. అవిసె గింజల నూనెను కూడా వాడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.