టమోటాతో ఇలా చేస్తే నల్లని మచ్చలు,మొటిమలు,పిగ్మెంటేషన్ అన్నీ మాయం అవుతాయి

Skin Whitening Tips in telugu : ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు, పిగ్మెంటేషన్ లేకుండా తెల్లగా అందంగా మెరిసి పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా అనుకోవటం కూడా సహజమే. అయితే దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.

చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాల్తో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. టమోటాను సగానికి కట్ చేసి దాని మీద పంచదార జల్లి ముఖాన్ని రబ్ చేసి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేయాలి. ఆతర్వాత ఇప్పుడు చెప్పే ప్యాక్ వేయాలి. ఒక బౌల్ లో మూడు స్పూన్ల టమోటా రసం, ఒక స్పూన్ శనగపిండి, పావు స్పూన్ లో సగం పసుపు వేసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత నీటిని జల్లుతు రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు,పిగ్మెంటేషన్ అన్నీ మాయం అయ్యి తెల్లని కాంతివంతమైన ముఖం మీ సొంతం అవుతుంది. శనగపిండి ఆన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. చర్మం మీద మృత కణాలను తొలగిస్తుంది.

అలాగే దుమ్ము,ధూళి,మురికిని తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది. ఇక టమోటా విషయానికి వస్తే టమోటాలో ఉండే విటమిన్ సి,లైకోపిన్ వంటివి ముఖం మీద మచ్చలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడతాయి. ఇక పసుపు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.