30 సంవత్సరాలుగా తగ్గని డయాబెటిస్ వ్యాధిని తగ్గించే అద్భుతమైన పొడి

Tamarind Seeds diabetes Benefits : ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. కొంతమంది అశ్రద్ద చేస్తూ ఉంటారు. డయాబెటిస్ ని అశ్రద్ద చేస్తే ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతుంది. డయాబెటిస్ ని సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. డయాబెటిస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Joint pains Home Remedies In telugu
డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే పొడి వాడితే డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయ పడుతుంది. చింత గింజల పొడి డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది. చింత గింజల గురించి పల్లెటూర్లలో ఉండే వారికి బాగా తెలుసు. అయితే ఇప్పుడు చింత గింజలు, చింత గింజల పొడి రెండూ కూడా ఆయుర్వేదం shops లేదా online stores లో లభ్యం అవుతున్నాయి.

అయితే చింత గింజల పొడి డయాబెటిస్ ని ఎలా నియంత్రిస్తుంది. అలాగే ఎలా వాడాలి అనే విషయాలను తెలుసుకుందాం. ప్యాంక్రియస్ గ్రంధి క్రమేపి బలహీనపడుతుంది. అలాగే టాక్సిన్స్ తో దెబ్బ తింటూ ఫ్రీరాడికల్స్ వల్ల నాశనం అవుతూ ఉంటుంది. అలాంటి డ్యామేజ్ ని అరికట్టి ప్యాంక్రియస్ గ్రంధి యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెరిగేటట్లు బీటా సెల్స్ ని పెంచి యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయడానికి చింతగింజల పొడి అద్భుతంగా పనిచేస్తుందని సైంటిఫిక్ గా నిరూపణ జరిగింది.

చింతగింజల పొడిలో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ ప్యాంక్రియస్ గ్రంథిలో ఉండే క్యాల్షియం చానల్స్ ని MRA ని మార్చి బీటా సెల్స్ ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ ని పెరిగేటట్లు చేస్తాయి. దాంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ప్రతి రోజు అరస్పూన్ పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.