వీటితో నూనె తయారుచేసి తలకు రాస్తే తెల్ల జుట్టు అనేది అసలు ఉండదు…ఇది నిజం

White hair Oil in telugu : ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా వస్తున్నాయి. వాటిలో తెల్లజుట్టు సమస్య అనేది చాలా తరచుగా వినిపిస్తుంది. తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే రావటం వలన చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అంతేకాక నలుగురిలోకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

తెల్లజుట్టు నల్లగా మారటానికి మరియు తెల్లజుట్టు రాకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే నూనె వాడితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక గిన్నె లో 300 గ్రాముల కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె తీసుకోవాలి. ఆ తర్వాత దానిలో 100 గ్రాముల ఆలోవెరా జెల్,100 గ్రాముల గుంటగలగర ఆకు పొడి వేసి మరిగించాలి.

పది నిమిషాలు అయ్యాక 50 గ్రాముల గంధ కచ్చూరాలు పొడి వేసి మరో పది నిమిషాలు మరిగించి పొయ్యి ఆఫ్ చేసి చల్లారాక నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు జుట్టుకు రాస్తూ ఉండాలి. ఈ విధంగా రాయటం వలన తెల్లజుట్టు అనేది అసలు ఉండదు. ఒకవేళ తెల్లజుట్టు ఉంటే నల్లగా మారుతుంది.

ఈ నూనెలో ఉన్న పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది. జుట్టుకి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.