ధనియాలతో వీటిని కలిపి తీసుకుంటే గొంతు నొప్పి,గొంతు ఇన్ ఫెక్షన్,జలుబు వంటివి అసలు ఉండవు

Cold And Cough HOme Remedies : దగ్గు, జలుబు, చాతిలో వచ్చే ఇన్ఫెక్షన్, శ్లేష్మం తగ్గటానికి మన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. వీటిని ప్రారంభ దశలోనే తగ్గించుకోవాలి. లేకపోతే ఇవి మన శరీరంలో అనేక రకాల రుగ్మతలు రావటానికి అవకాశాన్ని కల్పిస్తాయి. గొంతులో ఏ కాస్త తేడా ఉన్నా గడబిడ ఉన్నా చాలా ఇబ్బందిగా ఉండి నీరసించి పోతాం.
Dhaniyalu Health benefits in telugu
ఈ చిట్కా కోసం నాలుగు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఒక స్పూన్ ధనియాలు,పది మిరియాలను కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పొయ్యి వెలిగించి గ్లాసున్నర నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక ధనియాలు,మిరియాల మిశ్రమాన్ని వేయాలి. ఆ తర్వాత పావుస్పూన్ శొంఠి పొడిని వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత చిన్న పటిక బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించి ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. దగ్గు,జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.

అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరంలో అదనంగా ఉన్నా కొవ్వు కరిగిపోతుంది. కాబట్టి ఈ డ్రింక్ తయారుచేసుకొని ఇప్పుడు చెప్పిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.