Beauty Tips

Turmeric For Hair:పసుపుని ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు…ఇది నిజం

Turmeric For Hair In telugu : చాలా మంది జుట్టు సమస్యలు ఎదుర్కొంటారు. దీనికి పసుపుని ఉపయోగించి సమస్యని అదుపు చేసుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.. అదెలాగో చూద్దాం..పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీనిని తలకు రాయడం వల్ల జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి.

ముందుగా ఆలివ్ ఆయిల్ తీసుకోండి. అందులో కాసింత పసుపు కలిపండి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తలకి అప్లై చేయండి. వీలైతే నైట్ మొత్తం అలా వదిలేయండి. లేదా.. అరగంట తర్వాత శుభ్రం చేసుకోండి. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి తిరిగి పెరుగుతుంది.

చుండ్రు సమస్య కూడా దూరం చేస్తుంది. సున్నిత చర్మం వారు ఈ రెమిడీని వైద్యుల సలహా మేరకు వాడాలి. ఇక ఎవరైనా ఈ రెమిడీని వాడొచ్చు.
అదే విధంగా.. హెన్నాని వాడుతుంటే అందులో కాసింత పసుపు కలపాలి. దీన్ని తలకి పట్టించాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. జుట్టుకి మంచి రంగు కావాలనుకునేవారు..

ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా పచ్చిపాలలో పసుపు వేసి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.