ఇలా చేస్తే 2 నిమిషాల్లో కంటి చుట్టూ నల్లని వలయాలు మాయం
కంటి చుట్టూ నల్లటి వలయాలు కనపడగానే చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల క్రీమ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయిన పెద్దగా ప్రయోజనం ఉండదు. కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడినప్పుడు నిస్తేజంగా మారి ముఖ అందాన్ని పోగొట్టటమే కాకుండా, మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నామని, ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నామనే భావనను కలిగిస్తుంది.
ఈ నల్లటి వలయాలను డార్క్ సర్కిల్స్ అని ఇంగ్లీష్ లో అంటారు. కంటి కింద నల్లటి వలయాలు రావటానికి అనేక కారణాలు ఉంటాయి. జీవిత కాలంలో ఏ సమయంలోనైన లేదా ఎపుడైనా, ప్రతి ఒక్కరు కళ్ళ కింద నల్లటి వలయాను పొందుతారు.చర్మం కింద, సిరలలో రక్త స్థాయిలు తగ్గిపోవటం వలన సరైన నిద్ర లేకపోవటం , అనారోగ్యం, ఒత్తిడి వంటివి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుటకు కారణాలుగా చెప్పవచ్చు.
కంటి కింద నల్లటి వలయాలు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే నల్లటి వలయాలను సులభంగా తొలగించుకోవచ్చు.నల్లటి వలయాలను తగ్గించటంలో టమోటా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. టమోటాలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. టమోటా నలుపును తగ్గించి మెరిసేలా చేస్తుంది.
టమోటా రసం – 1 స్పూన్
నిమ్మరసం – 1 స్పూన్
శనగపిండి – చిటికెడు
పసుపు – చిటికెడు
ఒక బౌల్ లో టమోటా రసం,నిమ్మ రసం,శనగపిండి,పసుపు వేసి బాగా కలపాలి. ఈ చిక్కటి పేస్ట్ ను మీ కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. 20నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.