ఈ పిండితో ఇలా చేస్తే ముఖం మీద మచ్చలు పోయి మిలమిలా మెరిసిపోతుంది

Face Glow Tips In telugu : ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఆకర్షణీయంగా కనబడాలని కోరుకుంటున్నారు. దానికోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీమ్స్ ను కొని వాడేస్తున్నారు. అయితే వాటి వల్ల వాటిలో ఉపయోగించే రసాయనాలు వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
Young Look In Telugu
కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువులతో కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు మొక్కజొన్న పిండితో చిట్కాలను తెలుసుకుందాం. మొక్కజొన్న పిండిలో కొంచెం పెరుగు వేసి పేస్టుగా చేసి ముఖానికి, మెడకు రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా చేసుకోవటం వలన చర్మంలో ఉన్న మృతకణాలు అన్ని తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మొక్కజొన్న పిండిలో చిటికెడు పసుపు ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న అదనపు జిడ్డు తొలగిపోవడమే కాకుండా మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు ఫన్నీ తొలగిపోతాయి.

మొక్కజొన్న పిండిలో తేనె కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముడతలు తొలగిపోతాయి. ఇలా మొక్కజొన్న పిండితో చిట్కాలు పాటిస్తే చాలా తక్కువ ఖర్చుతో ముఖం మీద మచ్చలు,మొటిమలు,ముడతలు ఏమి లేకుండా కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.