Beauty Tips

కొబ్బరితో ఇలా చేస్తే జుట్టు నుండి ఒక్క వెంట్రుక రాలదు..రాలిన జుట్టు దగ్గర 2 రెట్లు జుట్టు వస్తుంది

Hair Fall Tips In Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంది. తల దువ్వితే చాలు ఎక్కడ పడితే అక్కడ జుట్టు రాలిపోతూ ఉంటుంది. దాంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండదు. ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది.

ఈ చిట్కా కోసం కొబ్బరి పాలను ఉపయోగిస్తున్నాం. అరచెక్క కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి అరకప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ చేసి వడకట్టి కొబ్బరి పాలను తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆతర్వాత ఒక అరటి పండును ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఆతర్వాత రెండు స్పూన్ల మందార పువ్వుల పొడిని వేసి మెత్తగా మిక్సీ చేయాలి.

ఒక బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని దానిలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న కొబ్బరి పాలను పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల ఆముదం లేదా బాదం నూనె వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తలకు నూనె రాసి రెండు నిమిషాలు మసాజ్ చేసి తయారుచేసి పెట్టుకున్న పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి.

అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టుకి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.