వీటిని నానబెట్టి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా…అసలు నమ్మలేరు

Soaking Foods benefits in telugu : కొన్ని ఆహారాలను పచ్చిగా కన్నా నానబెట్టి తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. నీటిలో నానితే వాటిలోని పోషకాలు రెట్టింపు అవ్వటమే కాకుండా వాటిలోని పోషకాలు మన శరీరంలోకి వంద శాతం అందుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే వాటిని నానబెట్టి తినటానికి ప్రయత్నం చేయండి.

పెసలు
మనం పెసలతో పెసరట్టు,పునుకులు వంటివి వేసుకుంటూ ఉంటాం. ప్రతి రోజు ఒక స్పూన్ పెసలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు తింటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు. పెసలలో ఉండే ప్రోటీన్,ఫైబర్ వంటివి జీర్ణసంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తాయి. ముఖ్యంగా మలబద్దకం ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.

అలాగే పొటాషియం,మెగ్నీషియం వంటివి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేయటమే కాకుండా రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డయబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయ పడుతుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

ఎండుద్రాక్ష
రాత్రి సమయంలో 5 ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. ఈ విధంగా తినటం వలన రక్తహీనత సమస్య ఉండదు. అలాగే జీర్ణ సంబంద సమస్యలు అయిన గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండటానికి ఎండు ద్రాక్షలో మెగ్నీషియం,పొటాషియం సమృద్దిగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.