1 గ్లాస్ తాగితే కొవ్వు కరిగి,బరువు తగ్గి, ఎంత పెద్ద పొట్ట ఉన్నా సరే తగ్గి స్లిమ్ గా మారతారు

Weight Loss drink : ఈ రోజుల్లో అధిక బరువు అనేది సాదరణం అయ్యిపోయింది. మారిన జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవటం,సరైన వ్యాయామం లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు.
pine apple benefits in telugu
అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, అరకప్పు కీరా దోస ముక్కలు మిక్సీ లో వేయాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అరకప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి.

ఈ మిశ్రమాన్ని గ్లాస్ లోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం కలిపి ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ముందు తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే క్రమంగా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు. పైనాపిల్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.

అలాగే జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే విటమిన్ B1 సమృద్దిగా ఉంటుంది. అల్లం శరీరంలో కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. నిమ్మరసం శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. ఈ డ్రింక్ చాలా రిఫ్రెష్ మరియు రుచిగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.