శనగపిండిలో ఈ రెండు కలిపి ముఖానికి రాస్తే మచ్చలు,మొటిమలు,జిడ్డు తొలగిపోతాయి

Besan Face Glow Tips in telugu : ముఖం మీద నల్లని మచ్చలు,దుమ్ము,ధూళి,జిడ్డు లేకుండా తెల్లగా అందంగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటిలో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, సరిపడా పాలను పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద జిడ్డు,నల్లని మచ్చలు, మొటిమలు అన్నీ తొలగిపోతాయి.

శనగపిండిలో(besan flour) ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాటం చేస్తుంది. అలాగే అదనపు జిడ్డు (సెబమ్) ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మం లోపల ఉండే దుమ్ము మరియు విష పదార్థాలను తొలగిస్తుంది. చర్మంపై ఉన్న నలుపును తొలగిస్తుంది.

కలబంద లో విటమిన్లు, ఖనిజాలు, పాలిసాకరైడ్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి చర్మం ఆరోగ్యంగా మరియు మృదువుగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే ముఖంపై వచ్చే నల్లని మచ్చలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.