ఇలా చేస్తే నిమిషంలో జలుబు,దగ్గు,గొంతు నొప్పి తగ్గి….జీవితంలో అసలు రాదు

Cold Remedies In telugu :వాతావరణం మారిన కారణంగా దగ్గు, జలుబు, గొంతునొప్పి అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి. జలుబు వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. ఈ రోజు పంచదార తో జలుబు ఎలా తగ్గించు కోవచ్చో చూద్దాం. జలుబు వచ్చిందంటే ఏ పని చేయాలని ఉండదు. మందులు వేసుకున్న కూడా తొందరగా ఉపశమనం కలగదు..

జలుబు ప్రారంభ దశలో ఉన్నప్పుడూ ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఎక్కువగా ఉంటే మందులు వాడుతూ ఈ చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా ఎలా చేయాలంటే…బొగ్గుతో నిప్పులు చేసి ఆ నిప్పుల మీద పంచదార జల్లి ఆ పొగను పిల్చాలి.

ఇలా రోజులో రెండు నుంచి నాలుగు సార్లు ఈ పొగను పీల్చితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దగ్గు,జలుబు నుండి మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.

అయితే మనలో చాలా మంది జలుబు,దగ్గు రాగానే మందులు వేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. సమస్య తీవ్రత తక్కువగా ఉంటే ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.