కీళ్ల నుంచి టక్ టక్ శబ్దం వస్తుందా… అయితే జాగ్రత్త పడే సమయం వచ్చినట్టే…!

Joint Pains Home Remedies In telugu :నడుస్తున్నప్పుడు కీళ్ల మధ్య శబ్దం వచ్చింది అంటే జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావటానికి ఇది ఒక సూచన అని చెప్పవచ్చు. ఈ సూచనను అసలు అశ్రద్ధ చేయకూడదు. మోకాళ్ళ కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు ఈ విధంగా శబ్దం వస్తూ ఉంటుంది.
Joint pains in telugu
ఈ విధంగా శబ్ధం రావటం ప్రారంభం కాగానే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. రాత్రి సమయంలో అర స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే కీళ్ల మధ్య గుజ్జు పెరగడమే కాకుండా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది

ఒక గ్లాసు పాలలో రెండు చిటికెల పసుపును వేసి ప్రతిరోజు తాగాలి. పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అలాగే పాలలో ఉండే పోషకాలు కూడా ఎముకలకు బలాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఎముకలు పేలుసుగా మారకుండా కాపాడతాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు తగ్గుతాయి.

వేపిన శనగలు కూడా ప్రతిరోజూ తింటుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ మూడింటిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కీళ్ల మధ్య గుజ్జు పెరగడమే కాకుండా మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ మూడు ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.