హైబీపీ (High BP) ఉన్నవారు వీటిని తింటే జీవితంలో అధిక రక్తపోటు అనేది ఉండదు
High Blood Pressure Reduced Foods : మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా చాలా చిన్న వయస్సులోనే అధిక రక్తపోటు సమస్య వస్తోంది. రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.
పాలకూర,కాలే వంటి ఆకుకూరలను వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీటిలో ఉండే పొటాషియం,మెగ్నీషియం,calcium, యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. పొటాషియం కిడ్నీల్లో ఎక్కువగా ఉన్న సోడియంను బయటకు పంపుతుంది. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
చాలా చవకగా సంవత్సరం పొడవునా లభ్యం అయ్యే అరటిపండు రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. అరటిపండులో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ప్రతి రోజు ఒక అరటిపండు తింటే సరిపోతుంది. ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మంచిది.
బీట్రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలా మంది బీట్రూట్ ని తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ప్రతి రోజు అరకప్పు బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది. బీట్రూట్ లో ఉండే నైట్రిక్ యాసిడ్ బ్లడ్ వెజల్స్ ని ఓపెన్ చేస్తాయి. అలాగే రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.
వెల్లుల్లి కూడా రక్తపోటు నియంత్రణలో చాలా బాగా సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ బయోటిక్,యాంటీ ఫంగల్ లక్షణాలు మజిల్స్ ని రిలాక్స్ చేసి రక్తనాళాలను సడలిస్తుంది. దాంతో రక్తప్రవాహం సాఫీగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.