ఈ ఆకులను ఇలా వాడితే డయాబెటిస్, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి అసలు ఉండవు
Reduces Insulin Resistance In Telugu : ఈ మధ్య కాలంలో 25 నుంచి 30 సంవత్సరాలు వచ్చేసరికి డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాలి. అలాగే డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే అధిక బరువు పెరగటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్,ట్రై గ్లిజరైడ్ స్థాయిలు పెరిగి గుండె సమస్యలకు కారణం అవుతుంది.
డయాబెటిస్ నియంత్రణకు ఆయుర్వేదంలో ఉన్న ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. నేలవేము,నేల ఉసిరి, జామ ఆకులను విడివిడిగా పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడులు ఆయుర్వేదం షాప్ లలో కూడా లభ్యం అవుతాయి. అలాగే కాకరకాయ పొడి, మెంతుల పొడిని కూడా తయారుచేసుకోవాలి. ఇవి కూడా మార్కెట్ లో లభ్యం అవుతాయి. కానీ వీటిని మన ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి 200 Ml నీటిని పోసి దానిలో అరస్పూన్ నేలవేము పొడి, అరస్పూన్ నేల ఉసిరి పొడి ,అరస్పూన్ జామ ఆకుల పొడి ,అరస్పూన్ కాకర పొడి, అరస్పూన్ మెంతుల పొడి వేసి 100 Ml అయ్యేవరకు మరిగించి వడకట్టి ప్రతి రోజు తాగుతూ ఉండాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్,ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. వాటిని కూడా తగ్గించటానికి ఈ కషాయం సహాయ పడుతుంది. అంతేకాక అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. కాస్త ఓపికగా ఇటువంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.