ఈ నూనెను వారంలో 3 సార్లు రాస్తే చాలు తెల్లజుట్టు నల్లగా మారుతుంది

Henna Oil For White Hair In Telugu : ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులో రావటం వలన చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మన ఇంటిలో సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

పొయ్యి వెలిగించి ఇనుప మూకుడు పెట్టి దానిలో 50 Ml ఆవనూనె లేదా నువ్వుల నూనె పోయాలి. నూనె కొంచెం వేడి అయ్యాక ఒక స్పూన్ ఉసిరి పొడి,గుప్పెడు మునగ ఆకులు లేదా ఒక స్పూన్ మునగ ఆకులపొడి, ఒక స్పూన్ హెన్నా పొడి, ఒక స్పూన్ మెంతి పొడి వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.
Drumstick leaves benefits in telugu
ఈ విధంగా మరిగించటం వలన వాటిలో ఉన్న పోషకాలు నూనెలోకి చేరతాయి. ఈ నూనెను రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టుకి పట్టించి రెండు గంటలు అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. లేదా రాత్రి సమయంలో నూనెను పట్టించి cap పెట్టుకొని మరుసటి రోజు తలస్నానం చేయాలి.
henna leaf
ఈ విధంగా ఈ నూనెను వారంలో మూడు సార్లు జుట్టుకి పట్టించాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ నూనెలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ సహజసిద్దమైనవి. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం, తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇటువంటి చిట్కాలను ఫాలో అయ్యి మంచి ఫలితాన్ని పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.