ఈ డ్రింక్ జీర్ణశక్తిని పెంచి అధిక బరువు,శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది

Apple cider vinegar weight Loss Drink In telugu : ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది మనలో చాలా మందిని వేదిస్తుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.
Weight Loss Tips in telugu
ఈ రెమిడీ కోసం ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక ఒక అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అరస్పూన్ పసుపు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని ఒక గ్లాసు లోకి వడకట్టి ఒక స్పూన్ Apple Cider Vinegar, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.

ఈ డ్రింక్ ని ఉదయం సమయంలో లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగటానికి ముందు తర్వాత అరగంట కడుపు ఖాళీగా ఉంటే మంచిది. ఈ డ్రింక్ లో ఉపయోగించిన Apple cider vinegar లో ఉండే ఎసిటిక్ యాసిడ్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.
weight loss tips in telugu
పసుపులో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు బరువు తగ్గించటంలో సహాయపడతాయి. అంతేకాక రక్తంలో చక్కెర స్థాయిలు, కొవ్వు కణజాలంలో కొవ్వు నిల్వలను నిరోధించటంలో సహాయపడుతుంది. తేనెలో ఉండే పోషకాలు ఆకలిని అణిచివేసే హార్మోన్‌లను సక్రియం చేస్తుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది.
Ginger benefits in telugu
అల్లంలో ఉండే యాక్టివ్ కాంపౌండ్ జింజెరాల్ అధిక బరువును తగ్గిస్తుంది. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. తీసుకున్న ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఆహారం నుండి పోషకాలను మెరుగ్గా శోషణ మరియు వినియోగించటానికి సహాయపడుతుంది. ఇది ఒక డిటాక్స్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.