ఈ డ్రైఫ్రూట్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది
Heart Healthy Nuts : డ్రైఫ్రూట్స్ ని మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడతాయి. రక్త నాళాలలో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుంది. అంతేకాక రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హార్ట్ బ్లాక్ లేదా హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించటంలో Dry Fruits సహాయపడతాయి. వాటి గురించి తెలుసుకుందాం.
కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో ఉండే అమినో యాసిడ్స్ రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను సులభతరం చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరిచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. డ్రై ఫ్రూట్స్ ని లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆ డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.
వాల్ నట్స్ అంటే జ్ఞాపకశక్తి మరియు మెదడు ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. అయితే వాల్నట్స్లో కనిపించే అసంతృప్త కొవ్వు – ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అస్థిరమైన గుండె లయల అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోదిస్తాయి. రోజుకి రెండు వాల్ నట్స్ తినవచ్చు. కాస్త ధర ఎక్కువైన దానికి తగ్గట్టుగా పోషకాలను అందిస్తుంది.
పిస్తాపప్పులో ఫైబర్, ప్రొటీన్లు సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంచటమే కాకుండా ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కూడా గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. పిస్తాపప్పు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా అసలు ఉండదు. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన అధిక బరువు,డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. రోజుకి 5 పిస్తా పప్పులను తినవచ్చు.
బాదం పప్పును ప్రతి రోజు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాటిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ఫైటోస్టెరాల్స్, ప్లాంట్ ప్రొటీన్, టోకోఫెరోల్, అర్జినిన్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, కాల్షియం మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పులో లభించే అర్జినైన్, ఒక రకమైన అమైనో ఆమ్లం, ఇది నైట్రిక్ ఆక్సైడ్ అనే అణువును తయారు చేయడానికి అవసరం, ఇది సంకోచించిన రక్త నాళాలను సడలించడానికి మరియు రక్త ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. రోజుకి 4 బాదం పప్పులను తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.