Beauty Tips

ఈ మ్యాజికల్ ఆయిల్ రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Magical oil for thick and black hair : మారిన జీవనశైలి పరిస్థితి మరియు సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే ఇప్పుడు చెప్పే ఆయిల్ వాడితే సరిపోతుంది.
curry leaves
గుప్పెడు కరివేపాకును శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. ఒక మిక్సీ జార్ లో ఎండిన కరివేపాకు ఆకులు, గుప్పెడు ఎండిన ఉసిరి ముక్కలు, రెండు స్పూన్ల క‌లోంజి విత్తనాలను వేసి మెత్తని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనెను పోసి కొంచెం వేడి అయ్యాక పైన తయారుచేసి పెట్టుకున్న పొడిని వేయాలి.

దాదాపుగా 15 నిమిషాలు మరిగితే వాటిలోని పోషకాలు నూనెలోకి చేరతాయి. ఈ నూనె చల్లారాక పల్చని క్లాత్ సాయంతో వడకట్టి సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రాత్రి పడుకొనే ముందు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి 5 నిమిషాలు మసాజ్ చేసి cap పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
Usiri health benefits In Telugu
రాత్రి సమయంలో కుదరని వారు పగటి సమయంలో ఈ నూనెను రాసుకొని రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టు నల్లగా కూడా మారుతుంది. జుట్టుకి సంబందించిన అన్నీ సమస్యలు తొలగిపోతాయి.
hair fall tips in telugu
ఉసిరి,క‌లోంజి విత్తనాలు,కరివేపాకు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. వీటిని జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా సమయాన్ని కేటాయించి పాటిస్తే చాలా చక్కని ఫలితాలను పొందవచ్చు. ఈ నూనెను తయారుచేసుకొని వాడి ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.