1 కప్పు నీరసం,నిస్సత్తువ,అలసట లేకుండా చేయటమే కాకుండా శరీరంలో వేడిని తగ్గిస్తుంది

Summer Curd Rice : వేసవికాలంలో శరీరంలో వేడి అధికంగా ఉంటుంది. అలాగే అలసట,నీరసం వంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వేడిని తగ్గించే ఆహారాలను తీసుకోవాలి. శరీరంలో వేడిని తగ్గించటానికి పెరుగు,పెసరపప్పు సహాయపడతాయి. ఇప్పుడు చెప్పే Curd Rice తయారుచేసుకొని తింటే అన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
moong dal
ఒక గిన్నెలో అరకప్పు బియ్యం,ఒక స్పూన్ పెసరపప్పు వేసి నీటిని పోసి శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీటిని, ఒక స్పూన్ ఉప్పు వేసి పాన్ లో పెట్టి మూడు విజిల్స్ వచ్చాక పొయ్యి ఆఫ్ చేయాలి. పది నిమిషాలు అయ్యాక పాన్ లోనుంచి గిన్నె తీసి ఉడికిన అన్నం,పెసరపప్పును ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.
How to cut onions without crying In Telugu
పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డ్ కలర్ కి వచ్చాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు,ఒక స్పూన్ మినపప్పు,ఒక స్పూన్ పచ్చి శనగపప్పు, రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగించాలి.
talimpu
ఆ తర్వాత 6 జీడిపప్పులు 4 కిస్ మిస్ లు,ఒక స్పూన్ అల్లం తురుము వేసి కొంచెం వేగాక కరివేపాకు వేసి బాగా వేగించి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన అన్నం,పెసరపప్పులో ఒక కప్పు పెరుగు,అరకప్పు నీళ్ళు, అరకప్పు పాలు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి.
Curd Rice
చివరగా పైన వేగించి పెట్టుకున్న తాలింపు వేసి బాగా కలపాలి. ఈ విధంగా తయారుచేసుకొని ఉదయం సమయంలో తింటే వేసవికాలంలో ఉండే అలసట,నీరసం,నిస్సత్తువ తగ్గటమే కాకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అంతేకాకుండా శరీరంలో వేడిని తగ్గిస్తుంది. వేసవికాలంలో వచ్చే సమస్యలు అన్నీ తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.