గంజిలో ఈ రెండు కలిపి జుట్టుకి పట్టిస్తే జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరగటం ఖాయం

How to use rice water for hair growth : ప్రస్తుతం ఉన్న కాలంలో పొల్యూషన్ కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనపడుతోంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఉండటం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక ఆయుర్వేద రెమిడీ తెలుసుకుందాం.

ఈ రెమిడీ ఫాలో అయితే జుట్టు కుదుళ్ల నుండి స్ట్రాంగ్ అవుతుంది. జుట్టు మృదువుగా ఉంటుంది. ఈ రెమిడీ కోసం గంజిని ఉపయోగిస్తున్నాం. గంజిలో ఉన్న పోషకాలు జుట్టును మృదువుగా చేయడమే కాకుండా చుండ్రును తొలగించడానికి సహాయపడి జుట్టు బలంగా ఉండేలా చేస్తాయి. ఆ తర్వాత కలోంజీ విత్తనాలు తీసుకోవాలి.

ఇవి జుట్టు పెరుగుదలకు సహాయ పడటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. ఇక ఆ తర్వాత మెంతులు తీసుకోవాలి. మెంతులు. చుండ్రును తగ్గించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఒక గిన్నెలో గంజి తీసుకొని రెండు స్పూన్ల కలోంజి విత్తనాలు, రెండు స్పూన్ల మెంతులు వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి.
Joint Pains Home Remedies in telugu
ఆ తర్వాత ఈ గింజలను చేతితో బాగా కలపాలి. అప్పుడే వాటిలో ఉన్న పోషకాలు గంజిలోకి వస్తాయి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టాలి. ఈ గంజిని జుట్టు .కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే చుండ్రు సమస్య సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. .
hair fall tips in telugu
ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీరు ఫాలో అవ్వండి. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాన్ని పొందుతారు. మెంతులు,కలోంజీ విత్తనాలలో ఉన్న పోషకాలు జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.