ఉదయం 1 కప్పు తింటే చాలు…అన్నీ పోషకాలు శరీరానికి అంది యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉంటారు

Healthy Breakfast Recipe : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో రెండు లేదా మూడు సార్లు సార్లు ఉదయం ఇప్పుడు చెప్పే బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే అధిక బరువు,డయాబెటిస్ వంటి ఎన్నో సమస్యల నుండి బయట పడటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
erra ravva
పొయ్యి మీద ఒక పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఒక కప్పు ఎర్ర గోదుమ రవ్వ వేసి రెండు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో రెండు స్పూన్ల నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఒక బిరియాని ఆకు,మూడు లవంగాలు,రెండు యాలకులు,8 మిరియాలు,అరస్పూన్ ఆవాలు,అరస్పూన్ మినపప్పు,అరస్పూన్ పచ్చి శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి.
How to cut onions without crying In Telugu
ఇవి కాస్త వేగాక 7 జీడిపప్పులు,చిటికెడు ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు (చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేయాలి), రెండు స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, రెండు ఎండుమిర్చి ముక్కలు,ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు రెమ్మల కరివేపాకు ఆకులు వేసి అరస్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయ వేగేవరకు వేగించాలి.
Carrot
ఆ తర్వాత అరకప్పు క్యారెట్ ముక్కలు,అరకప్పు బంగాళాదుంప ముక్కలు,అరకప్పు పచ్చి బఠానీ. సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం,ఒక స్పూన్ సాంబార్ పొడి, అరస్పూన్ ధనియాల పొడి వేసి 5 నిమిషాలు వేగించి 5 కప్పుల నీటిని పోసి ఒక పొంగు వచ్చాక వేగించి పెట్టుకున్న ఎర్ర గోదుమ రవ్వను పోసి బాగా కలిపి పాన్ లో పెట్టాలి.
ravva upma
మీడియం ఫ్లెమ్ లో మూడు కూతలు వచ్చాక పొయ్యి ఆఫ్ చేయాలి. పది నిమిషాలు అయ్యాక తినాలి. ఎర్ర గోదుమ రవ్వతో చేసిన ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా బ్రేక్ ఫాస్ట్ చేసుకొని వారంలో రెండు లేదా మూడు సార్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.