ఇలా చేస్తే చాలు చర్మంపై దురద,చర్మ సమస్యలు,దద్దుర్లు అన్నీ మాయం అవుతాయి

సాధారణంగా చర్మం మీద దురద,మంట, రాష్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే చర్మం మీద దురద అధికంగా ఉన్నప్పుడు విపరీతంగా గోకుతూ ఉంటాం. అలాంటప్పుడు చర్మం మీద పుండ్లు కూడా ఏర్పడతాయి. అలాగే కొంతమందికి దద్దుర్లు కూడా వస్తూ ఉంటాయి. చర్మం మీద దద్దుర్లు,మంట, దురద వంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చర్మ సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి ఆయింట్ మెంట్స్ వాడకుండా ఇంటి చిట్కాతో తొలగించుకోవచ్చు. ఈ చిట్కాకు కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏమిటో తెలుసుకుందాం.

ఈ చిట్కాకు కేవలం కాకరకాయ,పసుపు,కొబ్బరినూనె మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. కాకరకాయలో ఉన్న లక్షణాలు కారణంగా యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. చర్మంపై వచ్చే ఇన్ ఫెక్షన్స్,దురదలు తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది . కాకరకాయలో ఉండే చేదు చర్మంపై ఉండే బ్యాక్టీరియాను తొలగించటంలో సహాయపడుతుంది.

కాకరకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో అరస్పూన్ పసుపు వేయాలి. పసుపు కూడా యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండటం వలన చర్మ సమస్యలను తొలగిస్తుంది. అరస్పూన్ కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. కాకరకాయ పేస్ట్,పసుపు,కొబ్బరి నూనె బాగా కలిసేలా కలపాలి. ఈ కాంబినేషన్ లో తయారుచేసుకున్న పేస్ట్ చర్మ సమస్యలను తొలగించటంలో బాగా సహాయపడుతుంది.

చర్మ సమస్యలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఈ పేస్ట్ ని రాసి రెండు నిముషాలు మసాజ్ చేసుకొని బాగా ఆరేదాకా ఉంచుకోవాలి. అంటే దాదాపుగా నాలుగు గంటలు దాటాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఒకవేళ పగటి సమయంలో చర్మం మీద అప్లై చేయటం కుదరకపోతే రాత్రి పడుకొనే ముందు కాకరకాయ పేస్ట్ ని చర్మం మీద రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకొని కొంచెం ఆరాక పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మ సమస్యలు వచ్చి నప్పుడు ఈ చిట్కాను పాటిస్తే కొన్ని రోజులకు చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.