ఇలా చేస్తే ముఖంపై మంగు మచ్చలు,నలుపు,తెలుపు మచ్చలు అన్నీ మాయం అవుతాయి

Face Black spots Tips In telugu : మనలో చాలా మంది ముఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. ముఖం మీద నల్లని మచ్చలు, మంగు మచ్చలు వంటివి ఉంటే ముఖం అందంగా ఉండదు. అలాగే ఆత్మ విశ్వాసం కూడా తగ్గుతుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల బియ్యం పిండి,ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ టమోటా రసం వేసి బాగా కలపాలి. బియ్యం పిండి ముఖం మీద మృత కణాలను తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది. టమోటాలో ఉన్న లక్షణాలు మచ్చలను తగ్గించటానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మచ్చలను తొలగించటానికి సహాయపడుతుంది.
weight loss tips in telugu
ఈ పేస్ట్ ని మంగు మచ్చలు,నలుపు,తెలుపు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బంగాళ దుంప కూడా మంగు మచ్చలను తగ్గించటానికి సహాయపడుతుంది. బంగాళాదుంప తొక్కను తొలగించి తురిమి పలచని గుడ్డలో వేసి రసం వచ్చేలా పిండండి. దూదిని ఆ రసంలో ముంచి మచ్చలపై రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతి రోజు చేస్తుంటే మచ్చలు క్రమంగా తగ్గుతాయి.

ముఖంపై ఉండే మచ్చలను తగ్గించడంలో టమోటా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ టమోటా గుజ్జులో అరస్పూన్ కలబంద జెల్ వేసి బాగా కలిసేలా కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన మూడు చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. మీకు లభ్యతను బట్టి చిట్కాను ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.