ముఖం మీద మచ్చలు ఉన్నా…ఎంత నలుపు ఉన్నా…బ్యూటీ పార్లర్ కి వెళ్లినంత గ్లో వస్తుంది

Dark spots and pigmentation Home Remedies : ప్రస్తుత కాలంలో ఉన్న పొల్యూషన్ మరియు కొన్ని కెమికల్స్ కారణంగా ముఖం నల్లగా మారుతుంది. మొఖం మీద మచ్చలు, మొటిమలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి కారణంగా మనం బ్యూటీ పార్లర్ కు వెళుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం.
Young Look In Telugu
అలా కాకుండా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కలను ఉపయోగించుకుంటే మొటిమలు మరియు మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు అన్ని తొలగిపోతాయి. ఈ రెమిడీ కోసం బిళ్ళ గన్నేరు ఆకులను ఉపయోగించాలి. బిళ్ళ గన్నేరు ఆకులను గుప్పెడు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
billa ganneru plant uses in telugu
ఈ పేస్ట్ నుండి రసం తీసుకోవాలి. ఈ రసంలో రెండు స్పూన్ల Multani Mitti ని వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత పావు స్పూను నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేసుకుంటే ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు, నలుపు అంత తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
Multani Mitti Benefits In telugu
ఈ ప్యాక్ లో ఉపయోగించిన Multani Mitti ముఖానికి చల్లదనాన్ని అందించడంతో పాటు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి ముఖం మీద ఉన్న నలుపును కూడా తొలగిస్తుంది. నిమ్మకాయలో ఉండే .విటమిన్ సి, బ్లీచింగ్ లక్షణాలు ముఖం తెల్లగా కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది.
lemon benefits
బిళ్ళ గన్నేరులో ఉండే లక్షణాలు ముఖం మీద నల్లని మచ్చలను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా సమయాన్ని కేటాయించి ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఈ రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.