పొడవైన జుట్టు కావాలంటే 15 రోజుల ఛాలెంజ్…ఈ నూనె వాడితే జుట్టు రాలకుండా పెరుగుతుంది

Hair Growth Tips In telugu : సాదరణంగా ప్రతి ఒక్కరూ ఒత్తైన పొడవైన జుట్టు కావాలని కోరుకుంటారు. ఈ కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనపడుతుంది. వాతావరణ పరిస్థితులు,ఆహారపు అలవాట్లు వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య వస్తుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది.
hair fall tips in telugu
ఈ సమస్యల పరిష్కారానికి మార్కెట్ లో దొరికే అనేక రకాల నూనెలను వాడుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దమైన వస్తువులతో తయారుచేసిన నూనెను వాడితే చాలా మంచి ఫలితాన్ని చాలా తక్కువ సమయంలోనే పొందవచ్చు. ఈ నూనెను ఒక్కసారి తయారుచేసుకుంటే నెల రోజుల వరకు వాడుకోవచ్చు.
Hair fall Tips in telugu
5 ఎర్ర మందార పువ్వులను తీసుకొను రేకలను విడతీసి పెట్టుకోవాలి. కలబంద ఒక మట్ట తీసుకొని రెండు వైపులా అంచులను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి దానిలో మందార పువ్వుల రేకలు,కలబంద ముక్కలు, రెండు స్పూన్ల మెంతులు వేసి మరిగించాలి.
kalabanda beauty
మందార పువ్వు రేకలు,కలబంద నలుపు రంగు వచ్చే వరకు మరిగించాలి. ఈ నూనె చల్లారాక సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు జుట్టుకి పట్టించవచ్చు. లేదా రోజు విడిచి రోజు తలకు రాయవచ్చు. ఈ నూనెను రాసి సున్నితంగా 5 నిమిషాలు మసాజ్ చేస్తే రక్తప్రసరణ బాగా సాగి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
fenugreek seeds
ఈ నూనెను రాయటం మొదలు పెట్టిన 15 రోజులకు తేడా చాలా బాగా కనపడుతుంది. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి నూనెను తయారుచేసుకొని జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య,తెల్లజుట్టు సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.