2 స్పూన్స్ 7 రోజులు తింటే కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు,వశ్యత పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి
Natural remedy for sore joints and bones : ఎముకలు మరియు కీళ్లలో నొప్పి,నడుము నొప్పిని తగ్గించటమే కాకుండా కీళ్ల మధ్య శబ్ధం, కీళ్ల మధ్య జిగురు పెరగటానికి ఇప్పుడు చెప్పే ఈ రెమిడీ చాలా బాగా సహాయపడుతుంది. కీళ్ళు మరియు ఎముకలను బలపరుస్తుంది. వారం రోజుల పాటు ఉదయం ఒక స్పూన్,సాయంత్రం ఒక స్పూన్ తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
గుమ్మడి గింజలు 50 గ్రాములు తీసుకోవాలి. గుమ్మడి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.అలాగే ఫైటోఈస్ట్రోజెన్లు, జింక్,భాస్వరం, ఇనుము మరియు మాంగనీస్ సమృద్దిగా ఉండుట వలన కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడి ఎముకలను బలపరుస్తుంది. గుమ్మడి గింజల్లో విటమిన్ బి, ఇ మరియు కె ఉండుట వలన కీళ్ల మధ్య శబ్ధం రాకుండా చేస్తుంది. ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది.
ఎండుద్రాక్ష 50 గ్రాములు తీసుకోవాలి. ఎండు ద్రాక్షలో ఉండే కాల్షియం ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. పొటాషియం ఎముకల ద్రవ్యరాశిని సంరక్షిస్తుంది. బోరాన్ అనేది శరీరం నుండి కాల్షియం కోల్పోకుండా నిరోదించటం మరియు మెరుగైన కాల్షియం శోషణకు సహాయ పడుతుంది. సోడియం,మెగ్నీషియం కూడా ఎముకల బలాన్ని పెంచి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అవిసె గింజల పొడి 50 గ్రాములు తీసుకోవాలి. అవిసె గింజలు శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉండుట వలన శరీరంలోని అన్ని ఇన్ఫ్లమేషన్లను నివారిస్తుంది. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఎముకల మధ్య పగుళ్లను నివారిస్తుంది. మృదులాస్థి పునరుద్ధరణ చేసి ఎముకలు మరియు కీళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఒక మిక్సీ జార్ లో గుమ్మడి గింజలు,ఎండు ద్రాక్ష,అవిసె గింజల పొడి వేసి మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో 200 గ్రాముల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో నిల్వ చేసి ఫ్రిజ్ లో పెడితే 15 రోజుల పాటు వాడవచ్చు. రోజుకి 2 స్పూన్స్ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.