10 గింజలను ఇలా తీసుకుంటే రక్తాన్ని ఫిల్టర్ చేసి కిడ్నీ సమస్యలు లేకుండా చేస్తుంది

Toka Miriyalu Health benefits in telugu : మనలో చాలా మందికి తోక మిరియాలు గురించి పెద్దగా తెలియదు. తోక మిరియాలను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గింజలను తీసుకుంటే రక్తాన్ని ఫిల్టర్ చేయడమే కాకుండా కిడ్నీలను యాక్టివేట్ చేసి డీటాక్సిఫికేషన్ మరియు ప్యూరిఫికేషన్ చేయడంలో చాలా బాగా సహాయపడుతాయి..
Toka Miriyalu
తోక మిరియాలను వంటలో ఎక్కువగా ఉపయోగించరు. అందుకే మనలో చాలా మందికి ఈ తోక మిరియాల గురించి పెద్దగా తెలియదు. ప్రస్తుతం ఇవి ఆయుర్వేద షాపుల్లో విరివిగానే లభ్యం అవుతున్నాయి. తోక మిరియాలలో ఉండే సియోన్,కుబిబిక్ ఆమ్లం వంటి కెమికల్ కాంపౌండ్స్ కిడ్నీలలో ఫిల్టరేషన్ యాక్టివేట్ చేసి యూరిన్ ఎక్కువగా వచ్చేలా చేయడమే కాకుండా టాక్సిన్స్ బయటకు పోయేలా సహాయపడుతుంది.

తోక మిరియాలను ఉపయోగించడం వలన రక్తంలో టాక్సిన్ లోడు తక్కువ సమయంలోనే ఎక్కువగా తగ్గుతుందని 2019 లో జరిగిన పరిశోధనలో తేలింది.తోక మిరియాలలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ రక్తంలో ఇన్ ఫ్లమేషన్ మరియు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
Kidney problems
తోక మిరియాలు ఒక పది గింజలు తీసుకుని మెత్తని పొడిగా చేసుకుని ప్రతిరోజు కూరల్లో కలుపుకోవడం లేదా ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగవచ్చు. ఇలా తీసుకుంటే కిడ్నీలు శుభ్రంగా ఉండి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. శరీరంలో ఎక్కువగా టాక్సిన్ లు పేరుకు పోవటానికి నీళ్లు తక్కువ తాగడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మసాలాలు ఎక్కువగా తినడం వంటి వాటిని కారణాలుగా చెప్పవచ్చు.
toka miriyalu
ఈ అలవాట్లను మానేసి మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడానికి అలవాటు పడాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని తింటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.