కాకరకాయను తింటున్నారా…ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు

Kakarakaya Benefits In Telugu : కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన కాకరకాయ శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా. కాకరకాయ పేరు వినగానే వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు కాకర చేదును తలచుకొని కాకరకాయను తినటానికి ఇష్టపడరు. అయితే ఇటువంటి వారు కాకరకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు కాకరకాయను వదలకుండా తింటారు. కాకరకాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి.

కాకరకాయ పెరిగే ప్రాంతాన్ని బట్టి ముదురు లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాకరకాయలో A,B,C వంటి విటమిన్లు, బీటా-కేరొటీన్ వంటి ఫ్లవోనాయిడ్స్,కెరోటిన్, లుటీన్, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం వంటి విటమిన్లు సమృద్ధిగా  ఉంటాయి. బరువు తగ్గాలని అనుకొనే వారు కాకరకాయను రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Bitter gourd tea benefits In telugu
కాకరకాయను తిన్నప్పుడు కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జీవక్రియను, అరుగుదల విధానాన్ని ప్రేరేపించి బరువు తగ్గటానికి సహాయ పడుతుంది. క్యాన్సర్ కణాలను నిరోధించటమే కాకుండా పెరగకుండా చేస్తుంది. కాకరకాయలో ఉండే లక్షణాలు ధమని గోడలను ఆటంకపరిచే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది, దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాలేయం, మూత్రాశయం ఆరోగ్యంగా ఉచుకోవడానికి సహాయపడుతుంది.

అంతేకాకుండా రాళ్ళను  నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాకరకాయలో పీచు అధికంగా ఉండుట వలన త్వరగా జీర్ణం అవ్వటమే కాకుండా మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది. మధుమేహం ఉన్నవారికి కాకరకాయ దివ్య ఔషధం అని చెప్పాలి. కాకరకాయలో ఉండే గుణాలు రక్తంలో షుగర్ లెవల్స్ ని తగ్గించటమే కాకుండా ఇన్సులిన్ సరిగ్గా ఉండేలా చేస్తుంది.
Diabetes In Telugu
కాకరకాయలో ఉండే  ” హైపోగ్లసమిక్ ” అనే పదార్ధము ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తుంది. కాకరకాయ ముక్కలను నీటిలో  ఉడికించి ఆ నీటిని ప్రతి రోజు ఉదయం త్రాగుతూ ఉంటె శరీరంలో రోగనిరోధక శక్తి  పెరుగుతుంది. దాంతో ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. లివర్ సమస్యలు ఉన్నప్పుడు ఒక గ్లాస్ కాకరకాయ జ్యుస్ త్రాగితే మంచి ఫలితం కనపడుతుంది. కాకరలో ఉండే లక్షణాలు జలుపు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.