పెయిన్ కిల్లర్ డ్రింక్ 1 గ్లాసు తాగితే ఒంటి నొప్పులు అన్నీ మాయం…ఇది నిజం
Pain Killer Drink : విశ్రాంతి లేకుండా ఎక్కువగా పని చేయడం, గంటల తరబడి వ్యాయామాలు చేసినప్పుడు, అధిక ఒత్తిడి, జ్వరం వచ్చినప్పుడు, పోషకాల కొరత వంటి కారణాలతో ఒంటి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలుగుతుంది.
ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు నేచురల్ పెయిన్ కిల్లర్ గా పని చేసే వాము ఆకు ఒంటి నొప్పులను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. వాము ఆకుతో డ్రింక్ తయారుచేసుకొని తాగితే అన్నీ రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఒంటి నొప్పులు,కీళ్ల నొప్పులు,నడుము నొప్పి ఇలా అన్నీ రకాల నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.
మిక్సీ జార్ లో అరకప్పు వాము ఆకు, ఒక స్పూన్ అల్లం ముక్కలు, కొంచెం నీటిని పోసి మెత్తగా మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి వడకట్టాలి. దీనిలో రెండు స్పూన్ల తేనె,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఒక స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలను కూడా కలపవచ్చు. ఈ విధంగా తాగటం వలన ఎటువంటి పెయిన్ కిల్లర్స్ మందులు వేసుకోకుండానే నొప్పులు తగ్గుతాయి.
వాము ఆకులో పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు(Vitamins), యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్ ప్రతి రోజు తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలగటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అధిక బారు ఉన్నవారిలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా తగ్గుతాయి. వాము ఆకులో ఉండే యాంటీ బయోటిక్, అనస్తిటిక్ లక్షణాల కారణంగా నొప్పుల నూనీడ్ ఉపశమనం కలుగుతుంది. ఆకలిని పెంచే శక్తి కూడా ఉంది. ఆకలి లేనివారికి ఈ డ్రింక్ ని ఇస్తే ఆకలి పెరుగుతుంది.
మూత్ర పిండాలలో రాళ్లు, గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.