Healthhealth tips in telugu

వేరుశనగలు తిన్న వెంటనే నీరు తాగితే ఏమి అవుతుందో తెలుసా…?

Peanuts Benefits In telugu : మన రోజు వారి తినే ఆహార పదార్థాల్లో వేరుశనగలు తప్పకుండా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాం. కొందరు ప్రత్యేకంగా వేరుశనగలను తింటూ ఉంటారు.వేయించినవి లేదంటే పచ్చివి అలా కాదంటే ఉడకబెట్టినవి.ఇలా ఏదో ఒక రకంగా వేరుశనగలను తింటూనే ఉంటారు.వేరుశనగలను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే.

అయితే వాటిని తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల మాత్రం దుష్పరిణామాలు ఎదురవుతాయి అనేది వైధ్యుల సూచన. వేరుశనగలు తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వేరు శనగలు అంటేనే నూనె పదార్థం. అలాంటి నూనె పదార్థం అయిన వేరు శనగను తిన్న వెంటనే నీరు తాగడం వల్ల వేరుశనగల్లోని ఆయిల్‌ ఆహార నాళంకు పట్టి ఉంటుంది.
peanuts side effects
అలా పట్టి ఉండటంతో అది కాస్త కొవ్వుగా పేరుకు పోయి ఆహారనాళంపై ప్రభావం చూపుతుంది.పల్లీలు తినడం వల్ల ఒంటో వేడి పుడుతుంది.అతిగా పల్లీలు తింటే వేడి చేస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటి వేడి పదార్థాలు అయిన పల్లీలు తిన్న వెంటనే నీటిని తాగితే జీర్ణక్రియలో తేడా కొడుతుంది.ఆ తర్వాత జలుబు మరియు దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి.
Acidity home remedies
పల్లీల్లో ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది.అయితే తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్య అవుతుంది.అందుకే తినగానే నీటిని తాగకూడదు. పల్లీల్లో ఉండే పోషకాలు శరీరం వినియోగించుకునేందుకు తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలైనా నీళ్లు తాగకుండా వెయిట్‌ చేస్తే బాగుంటుంది.

పల్లీలు తినగానే నీళ్లు తాగడం వల్ల నోరు దుర్వాసన కూడా ఉంటుంది. అందుకే పళ్లీలు తిన్న కనీసం పావు గంట తర్వాత నీరు తాగితే మంచిది. వేరు శనగలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి వేరుశనగలను ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో అలా తిని ఆ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.