బొప్పాయి ఆరోగ్యానికే కాదు…మరెన్నో ప్రయోజనాలు…తెలిస్తే అసలు నమ్మలేరు

Papaya Benefits In telugu : బొప్పాయిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బొప్పాయిలో ఉన్న బ్యూటీ ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. జుట్టుకి సంబందించిన సమస్యలు,చర్మానికి సంబందించిన సమస్యలను పరిష్కరించటానికి చాలా బాగా సహాయపడుతుంది. పచ్చి బొప్పాయి, అలాగే పండిన పండు రెండూ బాగా సహాయపడతాయి.

చుండ్రు సమస్యతో బాధపడేవారు బొప్పాయి పండుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఒక బౌల్ లో రెండూ స్పూన్ల బొప్పాయి పేస్ట్, అరచెక్క నిమ్మరసం, నాలుగు చుక్కల వెనిగర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.
hair fall tips in telugu
పచ్చి బొప్పాయిని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. పలుచని వస్త్రం సాయంతో పేస్ట్ నుండి రసం తీయాలి.
ఒక బౌల్ లో మూడు స్పూన్ల బొప్పాయి రసం,మూడు స్పూన్ల కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఒక బౌల్ లో బొప్పాయి పండు గుజ్జు రెండూ స్పూన్లు తీసుకోవాలి. దానిలో రెండూ స్పూన్ల అరటిపండు గుజ్జును వేసి రెండూ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన చర్మం మీద మురికి,దుమ్ము,ధూళి అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
Wrinkles remove Tips In Telugu
ఒక బౌల్ లో ఒక స్పూన్ బొప్పాయి పండు గుజ్జు, అరస్పూన్ ముల్తానీ మట్టి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండూ సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద ముడతలు,బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ తొలగి కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.