జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది

Brain Foods : మతిమరుపు అనేది ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనపడేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 30 నుంచి 40 ఏళ్లు వచ్చేసరికి మతిమరుపు వచ్చేస్తోంది. అయితే ఆ విషయాన్ని గ్రహించలేక పోతున్నారు. జ్ఞాపకశక్తి తగ్గిపోవటం వలన అనేక రకాల సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయి.
Brain Foods
దానితో పాటు మెదడు పనితీరు మందగిస్తుంది. మతిమరుపు సమస్యను ముందుగా గుర్తిస్తే ఆ సమస్య నుంచి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొన్ని ఆహారాలను తీసుకుంటే మతిమరుపును తగ్గించుకోవచ్చు. మెదడు పనితీరును మెరుగుపరిచే పోషకాలు ఉన్న ఆహారం మీద దృష్టి పెట్టాలి.

చేపలు మెదడు పనితీరును మెరుగుపరచే ఆహారాలలో మొదటి స్థానంలో ఉన్నాయి. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి మెదడు తనంతట తానుగా అభివృద్ధి చెందడానికి, నాడీ కణాన్ని నిర్మించడానికి సహాయపడతాయి. దాంతో మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది.
weight loss tips in telugu
పసుపును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. పసుపులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పసుపులో ఉండే కర్కుమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు పనితీరును మెరుగుపరచటంలోనూ మరియు జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. పసుపు మెదడు వ్యాధులను నియంత్రించడమే కాకుండా, డిప్రెషన్‌కు కారణమయ్యే అల్జీమర్స్ ను తగ్గిస్తుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది.
broccoli
బ్రోకలీలో విటమిన్ కె సమృద్దిగా ఉండుట వలన మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుతుంది. విటమిన్ కె ఎక్కువగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి ,తెలివితేటలు మెరుగుపడతాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ ఆహారాలను వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.