గసగసాలను ఎక్కువగా వాడుతున్నారా…. ఈ 4 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు

gasagasalu uses :మనం ఉపయోగించే మసాలా దినుసుల్లో గసగసాలు ముఖ్యమైనవి.  వీటినే గసాలు అని కూడా పిలుస్తారు. పాపవెరాసెయే కుటుంబానికి చెందిన గసగసాల శాస్త్రీయ నామం పాపవర్ సోమ్నిఫెరం. గసగసాలు అనేవి నూనె కలిగి ఉండే విత్తనాలు. గసగసాలు నుండి నల్ల మందును తయారుచేస్తారు. నల్లమందు ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. గసగసాలను కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది.
gasagasalu uses
వీటిని ప్రాచీన కాలం నుండే ఔషధాల్లో వాడుతున్నారు. గసగసాలను వంటల్లో వేయటం వలన కమ్మని రుచి వస్తుంది. మూత్రపిండాల ఆకారంలో ఉండే గసగసాల గురించి మనలో చాలా మందికి తెలుసు. గసగసాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గసగసాలలో  కాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్ మరియు ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు  ఉంటాయి, వీటిలో గణనీయమైన పరిమాణంలో థయామిన్ మరియు ఫోలేట్ ఉన్నాయి.

ఈ గసగసాలలో లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది. ఆరోగ్యకరమైన గుండెకు అవసరమైన ఒమేగా -6 కొవ్వు ఆమ్లం కల్గి ఉంటుంది. గసగసాలలో 42% కొవ్వు, 28% కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్ మరియు 6% నీరు ఉంటాయి. చిన్నగా ఉండే ఈ గసగసాలలో ఎన్నో వ్యాధులను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గసగసాలు నిద్రలేమి సమస్యను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
sleeping problems in telugu
గసగసాలను పేస్ట్ గా చేసి ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కలపాలి. ఈ గసగసాల పాలను రాత్రి పడుకొనే ముందు త్రాగితే మంచి నిద్ర వస్తుంది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. గసగసాలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ ఆరోగ్యకర ఫైబర్ లు పేగు కదలికలను నిర్వహించటంతో పాటూ, మలబద్దకాన్ని కూడా తగ్గిస్తాయి.

దగ్గు మరియు దీర్ఘకాలిక ఆస్తమా నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీలో  ఏర్పడే రాళ్ళ ఏర్పాటును నివారించే శక్తిని గసగసాలు కలిగి ఉంటాయి. గసగసాలలో ఉండే ఆక్సలేట్ లు, శరీరంలో అదనంగా ఉన్న కాల్షియంను గ్రహించి, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. గుండె సమస్య ఉన్నవారు గసగసాలు లైట్‌గా ఫ్రై చేసి, పంచదార కలిపి  ఉదయం,సాయంత్రం అర స్పూన్  తీసుకొంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.